చల్లని పవనం మెత్తగా నా మేనును తాకి పులకింపచేస్తుంటే…మేఘుడు చిరుజల్లును ఎక్కడో విరజిమ్ముతున్నాడని తలచి……ఆకసంబును తేరిపారా జూస్తూ…పరవళ్లు తొక్కుతూ గలగలా పారుతున్న కృష్ణమ్మ
యదను ముద్దాడ చెంగు చెంగున గెంతుతున్న తెల్లని కుందేళ్లను తరుముతూ పరుగు పరుగున కాలువ గుట్టును చేరుకున్నా……మనసు మూగబోయి మాటమౌనమాయి..
ఒంటరిగా కూర్చున్న ఓ అందగాడ్ని చూసాను……ఏమోయ్, అక్కడేం చేస్తున్నావ్ అనిపిలవాలనిపించింది…కానీ కన్నుల్లో కోటి కలల కాంతిని నింపుకొని…..మోమున ముచ్చటిగోలిపే ధరహాసాన్ని దాచి,
కుంచెను పట్టుకొని మెలితిప్పుతూ బొమ్మను గీచిన రవి వర్మలా చేతిన గడ్డిపరకను పట్టుకొని పిల్ల కాలువలో నీటిని కదుపుతున్న నవ మన్మధుడిని చూసి గుండెఅదుపుతప్పుతుందేమోనన్న చిన్న భయం మనసున వున్నా….అతడి దరి చేరాలి అన్న ఆశ నన్ను ఇంకా ముందుకు నడుపుతుంటే……అతడిని అలానే చూస్తున్న నా కనుబొమ్మలు రెప్పవేయడం మరచినట్లు తదేకంగా లీనమై నను మరచి అతని నీడగా చేరి నను వెక్కిరిస్తున్నట్లు ఉంది….నా వెంటే వచ్చి నను ఒంటరిని చేసి చినుకై తనని స్పృశిస్తూ నను హేళన చేస్తున్న పవనాన్ని చూసి కను ఎఱ్ఱన చేయాలనిలేదు…..తడుస్తున్న తుంపర్లను చూస్తూ పూల సుగుందపు మరిమళం కన్నా మత్తుగా నవ్వుతున్న అతడి ఎత్తుకు అర అడుగు తక్కువన్నానని తల దించి నను చూస్తాడో లేదో అన్న సందేహంతో……ఇంట చేరి నన్ను నేను 2 అంగుళాలు పెంచుకునే చెప్పుల జతను పాదాలకు లంకించి వచ్చి చూస్తే అక్కడ అంతా సూన్యం…..ఇప్పుడు ఎక్కడని వేతకాలి అతని రూపపు కాంతి నీడను……కట కటా….అంటూ మనసును దోచుకున్న మనిషిని వెతుకుతున్న అమ్మాయి వ్యధ ఇది
💐!!నేను మీ శశిరేఖ!!💐
Continue reading “అతని జాడేది …”